జులై 26 మంగళవారం రాశిఫలాలు



మేషం
కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు పనితీరుకి అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఈ రోజంతా ప్రశాంతంగా ఉంటారు. నిర్మాణ రంగానికి సంబంధించిన పనుల్లో ధనలాభం ఉంటుంది.



వృషభం
ఉద్యోగులకు కార్యాలయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో గందరగోళం ఉండొచ్చు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. అవనసర ఖర్చులు అదుపుచేయండి. కుటుంబ విషయాలు బయటి వ్యక్తులకు చెప్పడం సరికాదు.



మిథునం
ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. అవివాహితులు వివాహం గురించి అడుగు ముందుకేయొచ్చు. ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు.



కర్కాటకం
ఈ రోజు ఈ రాశివారు శత్రువుల వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ అవసరాలను తీర్చడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి రావొచ్చు. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో సమావేశం అవుతారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి



సింహం
మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయడానికి ఇదే మంచి సమయం. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ పనిని పూర్తిగా ఆనందిస్తారు. వ్యాపార ఒప్పందాలు ఉండవచ్చు.



కన్యా
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు.సమస్యలు పరిష్కారం అవుతాయి.



తులా
ఆహారం మితంగా తీసుకోవాలి..వ్యాయామం చేయాలి. విద్యార్థులు చదువుపై దృష్టి సారిస్తారు. పరీక్షలు, ఇంటర్యూలో విజయం సాధిస్తారు. అధికారుల తీరు వల్ల మీరు ఇబ్బంది పడతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.



వృశ్చికం
మీ ఖర్చులను నియంత్రించండి. కాళ్ల నొప్పితో ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వస్తువులు మిస్ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి. అలసట, నిద్రలేమితో బాధపడతారు. ప్రయాణాల వల్ల అలసిపోతారు.పని ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది.



ధనుస్సు
అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. అవసరం లేని ప్రయాణాలు మానుకోవడమం మంచిది. జీవిత భాగస్వామి సలహాలు పరిగణలోకి తీసుకుంటే మంచిది. రోజంతా సంతోషంగా ఉంటారు. అలంకరణ కోసం డబ్బు ఖర్చు చేస్తారు.



మకరం
మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. విద్యార్థులు కష్టతరమైన సబ్జెక్టులను అధ్యయనం చేయడానికి ఒక ఆలోచన చేస్తారు. అందర్నీ సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. సామాజిక కార్యక్రమాలకు సహకరిస్తారు.



కుంభం
మీ జీవిత భాగస్వామి ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు. వైవాహిక సంబంధాల్లో మధురానుభూతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. కళలు, మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి ఉద్యోగావకాశాలను పొందుతారు. మీ మనసులో ప్రేమను వ్యక్తపరచేందుకు మంచి రోజు.



మీనం
పౌష్టికాహారంపై శ్రద్ధ వహించండి. కార్యాలయంలో క్రమశిక్షణను కొనసాగించండి. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండొచ్చు. ఏ పనిని మొదలుపెట్టినా పూర్తిచేయండి. స్నేహితుల కారణంగా పనులకు ఆటంకం కలుగుతాయి.