సెప్టెంబరులో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే!
మిగిలిన నెలలతో పోలిస్తే సెప్టెంబరులో పుట్టిన వారు తొందరగా సక్సెస్ అవుతారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలోనూ ఇదే విషయం స్పష్టమైంది.
సెప్టెంబరులో పుట్టిన వారు కృషిని నమ్ముకుంటారు. వీరికి చురుకుదనం చాలా ఎక్కువ అందుకే లైఫ్ లో తొందరగా సక్సెస్ అవుతారు.
వీరికి మహా తొందరపాటు..ఆలోనచ రావడమే తడవు వెంటనే అమలు చేసేస్తారు. వీళ్లకంటూ కొన్ని పద్ధతులుంటాయి. ఈ నెలలో పుట్టినవారు లాయర్లు, మంచి వక్తలుగా రాణిస్తారు.
సొంత ఆలోనచల ఆధారంగా వెళ్లిపోతారు కానీ పక్కవారి ప్రభావం వీరిపై అస్సలు ఉండదు. సెప్టెంబరులో పుట్టిన వారు ప్రేమ, కుటుంబ జీవితం అంత సంతోషంగా ఉండదు
వీరి బాల్యం, యవ్వనం అంతా కష్టాలు, శ్రమతో గడుస్తుంది. చెడు అలవాట్లు, చెడు స్నేహాలను దగ్గరకు రానివ్వకుండా చూసుకుంటే లైఫ్ లో బాగా సక్సెస్ అవుతారు
సెప్టెంబరులో పుట్టినవారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆహారం తీసుకోవడంలో వీరికంటూ కొన్ని ప్రత్యేక నియమాలు, అభిరుచులు ఉంటాయి
బయటకు కరుకుగా కనిపించినా వీరు చాలా సున్నిత మనస్కులు. పరిస్థితులు, వాతావారణం వీరికి అంత అనకూలంగా ఉండదు. ఇతరుల ప్రవర్తనవల్ల మానసికంగా గాయపడతారు
పాఠశాల విద్య, ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు. మిగిలిన విద్యార్థులకన్నా వీరు భిన్నంగా, ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటారు.
ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువ కాలం జీవించే అవకాశాలున్నాయని ఓ అధ్యయనం పేర్కొంది. శాస్త్రీయ కారణం ఏంటంటే ఈ కాలంలో జన్మించిన పిల్లలు సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు , అలెర్జీలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ వారు రోగనిరోధక శక్తి పెంచుకుంటారు.
మంచి ఆలోచనా విధానం కలిగి ఉంటారు, అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. తమవల్ల అవుతుంది అనుకుంటే ఎవ్వరికైనా ఎలాంటి సహాయం అయినా చేయడానికి సిద్ధంగా ఉండారు
Note: ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి (images credit: pinterest)