ABP Desam


ఆగస్టులో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే!


ABP Desam


ఆగస్టులో జన్మించిన వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి . వీరికి ధైర్యం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, విధేయత, గర్వం అన్నీ ఎక్కువే


ABP Desam


తలపెట్టిన పనిని ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తిచేస్తారు
సమాజంలో మంచి కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు, వీరిక సమయస్ఫూర్తి చాలా ఎక్కువ


ABP Desam


వీరికి ఇతరులపై గెలవడం అలవాటైపోతుంది, అనుకున్న ప్రతి విషయంలో ముందుండేందుకు చాలా ప్రయత్నిస్తారు, ముందుంటారు కూడా


ABP Desam


అనుకున్న పని అనుకున్నదే తడవుగా ప్రారంభిస్తారు, మొదలుపెట్టడమే తరువాయి అదెంత కష్టమైనా కానీ దూసుకెళ్లిపోతారు. వీరి ధైర్య సాహసాలు చూసి పలు సందర్భాల్లో చుట్టుపక్కల వారు, సన్నిహితులు ఆశ్చర్యపోతారు


ABP Desam


వీరు తలపెట్టిన పనులు మధ్యలో ఆగవు, ఒకవేళ ఆగితే మాత్రం మందుకు సాగడం చాలా కష్టం. ఆగస్టులో పుట్టినవారు డబ్బు విషయంలో దురదృష్టవంతులే అనిచెప్పాలి. సమయానికి వారి ఆలోచనలు కలసిరాకపోతే జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.


ABP Desam


వీరికి ఆలోచనలు చాలా ఎక్కువ, కలలుకనే స్వభావం ఉంటుంది, ఊహల్లో తేలిపోతారు. అదే సమయంలో కొన్ని సందర్భాల్లో సోమరితనంగా కూడా ఉంటారు


ABP Desam


ఏదైనా విషయంలో వస్తే మాత్రం ఢీ అంటే ఢీ అన్నట్టే ఉంటారు. ఎంతటివారినైనా ఎదిరేంచడంలో అస్సలు తగ్గరు. మంచి వాతావరణాన్ని, మంచి జీవతాన్ని కోరుకుంటారు. దేవుడిని నమ్ముతారు, సంప్రదాయాలను పాటిస్తారు


ABP Desam


ఆగస్టులో జన్మించిన వారికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది, లోకజ్ఞానం కూడా అంతుకుమంచి అనేలా ఉంటారు. మతం, పురాణాలపై అవగాహన ఉంటుంది



ఈ నెలలో పుట్టినవారు ప్రేమ జీవులువీరి ప్రేమ చాలాలోతైనది. తల్లిదండ్రులను, సోదరులను మాత్రమే కాదు..తన అనుకున్న ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. కుటుంబనియమాలు పాటిస్తారు. వృత్తిపట్ల గౌరవంగా ఉంటారు



వీరెప్పుడూ ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడరు..అయితే ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు మాత్రం అత్యంత సన్నిహితులతో మాత్రమే పంచుకుంటారు