'అందాల రాక్షసి' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో తన అమాయకపు లుక్స్ తో యూత్ ను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది. ఆమె నటించిన 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయన' లాంటి సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న హీరోలందరితో ఆమె కలిసి నటించింది. కానీ స్టార్ కాలేకపోయింది. ఆమె నటించిన 'ఏ1 ఎక్స్ ప్రెస్', 'చావు కబురు చల్లగా' లాంటి సినిమాలు సరిగ్గా ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవల 'హ్యాపీ బర్త్ డే' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉండగా.. తాజాగా లావణ్య త్రిపాఠి కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో యాటిట్యూడ్ చూపిస్తూ అమ్మడు ఇచ్చిన పోజులు ఆకట్టుకుంటున్నాయి.