జులై 15 శుక్రవారం రాశిఫలాలు



మేషం
ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు, వృత్తి వ్యాపారాలు చేసేవారికి శుభసమయం. విదేశాలకు వెళ్లాలనుకున్న విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. కొన్ని పరిచయాలు ఆర్థికంగా మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తాయి.



వృషభం
ఈ రోజు మీ జీవితంలో కొత్త ఆనందం రాబోతోంది. ఓ శుభవార్త వింటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా దఢంగా ఉంటారు.



మిథునం
ఈ రోజు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటినుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. పదోన్నతికి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది.



కర్కాటకం
ఆకస్మిక ద్రవ్య లాభాలు ఉండొచ్చు. కొన్ని సమస్యల నుంచి బయటపడేందుకు స్నేహితుల సహకారం అందుతుంది. ఉద్యోగులు తమ పనితీరుని మెరుగుపర్చుకునే నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకోవడం మంచిది.



సింహం
ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. గౌరమ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారం బాగానే సాగుతుంది.



కన్యా
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ మాటలు చాలామందికి మోటివేషన్ కలిగిస్తాయి. కొన్ని క్లిష్టమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. రోజువారి పనులు పూర్తిచేయగలుగుతారు. రోజంతా సరగాదా ఉంటారు.



తులా
తులారాశికి చెందిన వ్యాపారులు వ్యాపారంలో లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు మీకుంటాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. స్నేహితులు నుంచి సహకారం అందుతుంది.



వృశ్చికం
ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చేయబోయే కొన్ని పనులు రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి చేస్తాయి. క్లిష్టమైన సమస్యలు పరిష్కరించేందుకు ఇదే మంచి సమయం. మీ తెలివితేటలు, సలహాలు చాలామందికి ఉపయోగపడతాయి.



ధనుస్సు
ఈ రోజు మీరు రిస్క్ తీసుకుంటేనే కొన్ని పనులు పూర్తవుతాయి. ఎప్పుడూ కంఫర్ట్ గా ఉండాలనే భావన నుంచి బయటకు రండి. కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాదించే దోరణి మానుకోండి. కోపం ప్రదర్శించకండి.



మకరం
ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తారు. రచనా రంగానికి చెందిన వారికి చాలా మంచి రోజు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు బాగానే ఉంటుంది.



కుంభం
ఈ రోజు మీరు చేసే పనులకు కుటుంబం నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తారు. వినోదం, విలాసాల కోసం ఎక్కువ ఖర్చులు చేయవద్దు. జీవిత భాగస్వామి మాటలకు విలువనివ్వండి.



మీనం
ఈ రోజు మీరు ఏ పని చేసినా దాని నుంచి కచ్చితంగా కొంత ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల కోసం ఆలోచనలు చేస్తారు. చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు.