గాలికాలుష్యంతో అలాంటి పిల్లలు పుట్టే అవకాశం?



సాధారణంగానే గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారపరంగా, ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్త పాటిస్తే పుట్టే పిల్లలు అంత హెల్దీగా ఉంటారు.



గర్భిణులు అధికంగా గాలి కాలుష్యానికి గురైతే వారికి పుట్టబోయే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉందని చెబుతోంది కొత్త అధ్యయనం.



ఇలా తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఆస్తమా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వివరిస్తోంది.



ఎవరైతే గాలి కాలుష్యానికి దూరంగా, పచ్చటి ప్రకృతిలో నివసిస్తారో అలాంటి వారికి ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశం ఉంది.



వేడి గాలులకు లేదా అతి చల్లని గాలులకు కూడా గర్భిణులు గురవడం మంచిది కాదు.



వేడి గాలి వల్ల శరీరం డిహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అలాగే చల్లని గాలుల వల్ల కూడా కొన్ని రకాల సమస్యలు రావచ్చు.



సాధారణ వాతావరణంలో గర్భిణీలు జీవించేలా చూసుకోవాలి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.



ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, చిరుధాన్యాలు వంటి వాటిని డైట్‌లో భాగం చేసుకోవాలి.