చాణక్య నీతి: భర్తలో ఈ లక్షణాలుంటే ఆ భార్య లైఫ్ బిందాస్ చాణక్యుడు చెప్పిన విషయాలు నాటి తరానికే కాదు ఇప్పటి తరానికి కూడా అనుసరణీయమే రాజనీతి, పరిపాలన గురించి మాత్రమే కాదు వ్యక్తిగత జీవితం, బంధాల గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు ప్రతి భర్త తన జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఒంటెను అనుసరించాలని సూచించాడు చాణక్యుడు ప్రతి భర్త తన జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఒంటెను అనుసరించాలని సూచించాడు చాణక్యుడు ఒంటె ఎప్పుడూ సంతృప్తికర జీవితాన్ని గడుపుతుంది, ఏ ఆహారం తీసుకున్నా ఇష్టంగా తింటుంది. తిండి కోసం పెద్దగా అన్వేషించదు. భార్య విషయంలో భర్త ఇలానే ఉండాలి ఒంటెకి ధైర్యం ఎక్కువ. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భయపడదు. కుటుంబానికి పెద్ద అయిన భర్త కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అండగా ఉండాలి ఆచార్య చాణక్యుడు విధేయతను గొప్ప ధర్మంగా అభివర్ణించాడు. జంతువులలో ఒంటె అత్యంత నమ్మకమైన జంతువు. భార్య కూడా తన భర్త నుంచి విధేయతను ఎక్కువగా కోరుకుంటుంది. తనకి విధేయుడిగా ఉండాలని ప్రతి భార్యా ఆశిస్తుంది. అలా ఉండే భర్తతో భార్య సంతోషంగా ఉంటుంది, ఆ కుటుంబంతో సంతోషాన్ని నింపుతుంది ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి భర్తకు ఒంటెలో ఉన్న గుణాలు ఉంటే ఆ వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగిపోతుందన్నది చాణక్యుడి మాట Images Credit: Pinterest