ఉప్పు ఎక్కువగా తింటే డయాబెటిస్ వస్తుందా?

చాలా మంది తియ్యటి పదార్థాలు ఎక్కువ తింటే మధుమేహం వస్తుంది అనుకుంటారు.

కానీ, అందులో పూర్తి వాస్తవం లేదంటున్నారు పరిశోధకులు.

మధుమేహానికి తీపి పదార్థాలు ఒక కారణం మాత్రమే అంటున్నారు.

మధుమేహం రావటానికి ప్రధాన కారణాల్లో ఉప్పుది కీలక పాత్ర వహిస్తుందట.

ఆహారంలో ఎక్కువ ఉప్పు తీసుకున్న వారే ఎక్కువగా డయాబెటిస్ బారిన పడుతున్నారట.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గిపోతుందట.

ఇలాంటి వారి మూత్రంలో సోడియం అధికంగా బయట వెళ్తుందట.

బయట దొరికే ప్రాసెస్డ్‌ ఫుడ్స్ తోనే ఈ ముప్పు పెరుగుతుందంటున్నారు నిపుణులు.

అందుకే, అవసరం ఉన్నంత వరకే ఉప్పును వాడాలని సూచిస్తున్నారు.

All Photos Credit: pixabay.com