రోజూ పనీర్ తినవచ్చా?



పనీర్ బిర్యాని, పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్, పనీర్ టిక్కా... ఇవన్నీ కూడా భారతీయుల మనసు దోచిన ఆహారాలు.



కొంతమంది ప్రతిరోజూ పనీర్ తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదా? కాదా?



పనీర్ రోజూ తినవచ్చా అంటే నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ 50 గ్రాములకు మించకుండా తింటేనే మంచిది.



ప్రతిరోజు తినేవారు వంద గ్రాముల పనీర్ తినాల్సిన అవసరం లేదు. దీనివల్ల బరువు త్వరగా పెరిగిపోతారు.



రోజుకు 50 గ్రాముల పనీర్‌ను తింటే శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి.



దీనిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉంటాయి.



ఆర్థరైటిస్ వంటి రోగాల బారిన పడినవారు పనీర్‌ను ప్రతి రెండు రోజులకు ఒకసారి తినడం చాలా ముఖ్యం.



పనీర్‌లో ప్రోటీన్లు అధికంగా ఉండి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహ రోగులు కూడా పనీర్‌ను తినవచ్చు.