ప్రతిరోజూ చికెన్ తినవచ్చా?

చికెన్ ఆరోగ్యకరమే కానీ, రోజూ తినాల్సిన అవసరం లేదు. రెండు మూడు రోజులకోసారి తిన్నా చాలు.

చేపలు తరువాత ఆరోగ్యకరమైన మాంసం ఇదే. వారానికి రెండు సార్లు తిన్నా చాలు మన శరీరానికి అవసరమైన ప్రొటీన్ అందుతుంది.

ఆరోగ్యం కదా అని రోజూ తింటే కొన్ని అనారోగ్యాలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

రోజూ కోడిమాంసం తినేవారిలో ప్రొటీన్ అధికంగా శరీరంలో చేరుతుంది. ఇది కొవ్వు రూపంలో మారి పేరుకుపోతుంది. మీకు తెలియకుండానే బరువు పెరుగుతారు.

రక్తంలో లిపిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. కాబట్టి రోజూ తినే అలవాటును మానుకుంటే మంచిది.

చికెన్ లాంటి అధిక ప్రోటీన్ ఉత్పత్తులను అతిగా తినడం వల్ల పరోక్షంగా గుండె సంబంధ వ్యాధులను పెంచుకున్కనట్టే. అంటే అకాల మరణాన్ని కొని తెచ్చుకున్నట్టే.

శాఖాహారులతో పోలిస్తే రోజూ చికెన్ తినేవారి BMI అధికంగా ఉన్నట్టు గుర్తించారు అధ్యయనకర్తలు.

చికెన్ శుభ్రంగా కడిగి, బాగా ఉడికించాలి. ఇలా చేయకపోతే ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే అవకాశం ఎక్కువ.