షుగర్ టెస్టుకు ముందు కాఫీ, టీ తాగొచ్చా?

డయాబెటిస్ వచ్చిందో లేదో కచ్చితంగా చెప్పే పరీక్ష... రక్త పరీక్ష.

అందులోనూ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం.

చక్కెర స్థాయిలు కోసం 10 నుంచి 12 గంటల ఉపవాసం ఉండి అప్పుడు వెళ్లాలి.

అయితే చాలా మంది టీ, కాఫీ తాగొచ్చు కదా అనుకుంటారు. కానీ అలా తాగకూడదని చెబుతున్నారు వైద్యులు.

టీ, కాఫీల తాగడం వల్ల అందులోని పోషకాలు రక్తంలో గ్లూకోజ్, లిపిడ్ స్థాయిలను మారుస్తాయి.

అలాగే రక్తంలోని సీరం (ప్లాస్మా) దట్టంగా మారుతుంది.

నీరు మాత్రం తాగవచ్చని చెబుతున్నారు వైద్యులు. వేడి నీళ్లు కూడా తాగవచ్చు.

అయితే రాత్రంతా నిద్రపోకుండా నైట్ షిప్టులు చేసేవారు మాత్రం షుగర్ టెస్టు చేయించుకుంటే కచ్చితమైన ఫలితాలు రావు.