డయాబెటిస్ తో బాధపడేవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేసేందుకు సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు.

మధుమేహులు అందుకే కార్బోహైడ్రేట్లను పరిమితంగా తీసుకోవాలి.

డ్రైఫ్రూట్స్ డయాబెటిక్స్ వారి ఆహారంలో భాగం చేసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

డయాబెటిస్ తో బాధపడుతున్న వారు కొద్ది మొత్తంలో డ్రైఫ్రూట్స్ తప్పక తీసుకోవాలి.

ఎండలో ఎండిన డ్రైఫ్రూట్స్ లో సహజమైన ప్రక్టోజ్, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి.

పరిమితికి మించి తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

రోజంతా తీసుకునే డ్రైఫ్రూట్ పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ట్రయల్ మిక్స్ ల వంటి వి తీసుకునే విషయంలో కూడా జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు.

యోగర్ట్ లో వేసిన ఎండు ద్రాక్ష, తేనెలో ఊరేసిన వెరుశనగలు వంటివన్నీ కూడా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతాయి.

వీటిలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ చక్కెరలు ఉండొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం.
Representational Image : Pexels