క్యాబేజీ వడలు... ఇలా చేస్తే సూపర్

క్యాబేజీ తరుగు - ముప్పావు కప్పు
మినప్పప్పు - అర కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
పచ్చిమిర్చి - ఒకటి
ఉప్పు -రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని
నూనె - సరిపడినంత
పచ్చి బఠానీ - పావు కప్పు
ఉల్లిపాయ - ఒకటి

మినపప్పు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.

ఆ రుబ్బులో క్యాబేజీ తరుగు, ఉడకబెట్టిన పచ్చిబఠానీలు వేసి బాగా కలపాలి.

అలాగే అందులో ఉల్లిపాయల తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి.

కళాయిలో నూనె వేసి వేడెక్కనివ్వాలి.

రుబ్బును వడల్లా నూనెలో వేయించుకుంటే క్యాబేజీ వడలు రెడీ అయిపోతాయి.

నూనెను పీల్చే కాగితంపై వాటిని వేస్తే వడల్లో ఉన్న నూనెను పీల్చేస్తాయి.