ప్రస్తుతం ₹1,000 ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని ₹7,500కి పెంచుతున్నారా..

Published by: Shankar Dukanam

మీడియా నివేదికల ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ CBT సమావేశంలో ఆమోదించబడవచ్చని ప్రచారం జరిగింది

పార్లమెంటు శీతాకాల సమావేశంలో ప్రభుత్వం దీనిపై స్పందించింది. డిసెంబర్ 1 నాడు పార్లమెంటులో పెన్షన్ పై ప్రస్తావించారు.

పెన్షన్ పెంచుతున్నారా.. ప్రభుత్వం ఏం చేయనుందని ఒక రాతపూర్వక ప్రశ్న పార్లమెంట్‌లో లేవనెత్తారు

ఎంపీ సురేష్ గోపినాథ్ మహత్రే పెన్షనర్లకు సంబంధించి పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రశ్నలు లేవనెత్తారు.

కనీస పెన్షన్ ₹7,500కి పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తుందా సహా వారు ఆరు అంశాలపై వివరణ కోరారు.

పెన్షన్ ఎందుకు పెంచలేదు, పెన్షనర్లకు DA ఎందుకు ఇవ్వలేదని.. ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిందా అని ప్రశ్నించారు.

కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పెన్షనర్లకు నిరాశ కలిగించే విషయం చెప్పారు.

కనీస పెన్షన్ పెంచేందుకు ప్రస్తుతం కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. పెన్షన్ లో పెద్దగా పెంపు ఉండదన్నారు

ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ లభిస్తుంది, కానీ EPS 95 కింద పెన్షనర్లకు వర్తించదని తెలిపారు.