విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి పొందటానికి రూఫ్ టాప్ సోలార్ ప్యానళ్లు ఉపకరిస్తాయి 'ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన'కు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇప్పుడు సబ్సిడీ ధరకే ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు సబ్సిడీ తీసుకోవడంతోపాటు మీ ఇంటికి జీవితకాలం ఉచితంగా విద్యుత్ పొందొచ్చు. 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్ సిస్టమ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.30 వేలు సబ్సిడీ ఇస్తుంది. సబ్సిడీ పోను, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు కోసం చేసే అదనపు ఖర్చును రుణం రూపంలో పొందొచ్చు సబ్సిడీ కోసం https://pmsuryaghar.gov.in లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆమోదం పొందిన తర్వాత, సంబంధిత డిస్కంలో నమోదు చేసుకొని ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. పోర్టల్‌లో కమిషనింగ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, బ్యాంక్ ఖాతా వివరాలు, క్యాన్సిల్ చేసిన చెక్‌తో సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోండి. 30 రోజుల్లోగా మీ బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ మొత్తం క్రెడిట్ అవుతుంది.