ఆదాయ పన్ను శాఖ ఇప్పటి వరకు ITR 1, ITR 2, ITR 3, ITR 4, ITR 5, ITR 6, ITR 7 ఫారాలను ప్రవేశపెట్టింది. భారత నివాసి అయి ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.50 లక్షలు దాటకపోతే ITR 1 ఫామ్ సమర్పించాలి. ఒక వ్యకి లేదా హిందు అవిభాజ్య కుటుంబానికి (HUF) వ్యాపారం లేదా వృత్తి నుంచి లాభాలు ఆర్జించని పక్షంలో ITR 2 ఫామ్ ఉపయోగించాలి. ITR-3: వ్యాపారం లేదా వృత్తి నుంచి లాభాలు, ఆదాయం కలిగిన వ్యక్తి లేదా HUF ఈ ఫామ్‌ను ఎంచుకోవాలి. వృత్తి నుంచి వచ్చే ఆదాయం ఆదాయ పన్ను సెక్షన్లు 44AD, 44ADA లేదా 44AE ప్రకారం లెక్కించే సందర్భంలో ITR-4 ఎంచుకోవాలి. ITR-5: ఒక వ్యక్తి, HUF, కంపెనీ కాకుండా, ITR-7ను దాఖలు చేసే వారికి ఇది వర్తిస్తుంది. ITR-6: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 11 కింద మినహాయింపును క్లెయిమ్ చేయని సంస్థలు ఈ ఫామ్‌ను ఉపయోగించాలి. 139(4A), 139(4B), 139(4C), లేదా 139(4D) సెక్షన్ల కింద రిటర్న్‌లు ఫైల్ చేసే సంస్థలు ITR-7 ఎంచుకోవాలి.