ఒకప్పుడు, ఐటీఆర్ ఫైల్ చేయాలంటే కచ్చితంగా ఒక ఆడిటర్ అవసరం ఉండేది ఇప్పుడు టెక్నాలజీ మారింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సైతం వచ్చేసింది. ప్రి-ఫిల్‌డ్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ కూడా అందుబాటులో ఉంది. ఇన్‌కమ్ డిక్లరేషన్ లో చిన్న పొరపాటు జరిగినా ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీస్ రావచ్చు మొదటిసారి ఐటీఆర్ ఫైల్ చేస్తున్నట్లయితే, మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్‌ను వద్ద ఉంచుకోండి. మీ ఆధార్ నంబర్- పాన్ కార్డ్ కచ్చితంగా లింక్ అయి ఉండాలి అధికారిక వెబ్‌సైట్ https://eportal.incometax.gov.in లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ITR ఫైల్ చేసే ముందు AIS, TIS, ఫామ్-26ASను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. వార్షిక సమాచార నివేదికలో (AIS) మీ పూర్తి ఆదాయాల వివరాలు ఉంటాయి. ఆదాయ పన్ను విభాగం పోర్టల్‌లోకి మీ యూజర్ ఐడీ (పాన్), పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మీ సంపాదన, TDS, అడ్వాన్స్ టాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్, డిమాండ్ సమాచారం ఉంటుంది వీటన్నింటినీ తనిఖీ చేసి, తప్పులు ఏవైనా ఉన్నాయో చూసుకోండి ఏదైనా అంకె సరిగ్గా లేదు అనిపిస్తే, మీ యాజమాన్యాన్ని లేదా బ్యాంక్‌ను సంప్రదించాలి అన్ని సమస్యలు తొలగిపోయిన తర్వాత మీ ITR ఫైల్ చేయండి