ప్రజల్లో సేవింగ్స్ పై అవగాహన పెంచేందుకు చిన్న మొత్తాల పొదుపు పథకాలు ప్రవేశపెట్టింది కేంద్రం. నిర్దేశిత సమయాల్లో లేదంటే నెల నెల డబ్బు దాచుకునేలా వీటిని రూపొందించింది. జమ చేసిన డబ్బుపై వడ్డీ వస్తుంది. కొన్ని సంవత్సరాలు దాచిన తర్వాత అసలు + వడ్డీ కలిపి ఒకేసారి తీసుకోవచ్చు. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం మూడు నెలలకోసారి సవరిస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల చిన్న మొత్తాల పథకాలను నిర్వహిస్తోంది. బాలికల కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ప్రవేశపెట్టింది. 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజనపై 8 శాతంగా ఉన్న వడ్డీని 8.2 శాతానికి పెంచింది కేంద్రం. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పీపీఎఫ్ బాగా పాపులర్ పథకం. 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వడ్డీని మార్చలేదు. మిగతా అన్ని డిపాజిట్లపై వడ్డీ రేటు దాదాపు 6 నుంచి 8 శాతం వరకు ఉంది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌పై 8.2 శాతం ఉండగా.. కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టే వారికి 7.5 శాతం వడ్డీ. దీని మెచ్యూరిటీ కాలం 115 నెలలు.