ప్రతి ఒక్కరు.. భవిష్యత్తు గురించి ఆలోచించే ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ చేస్తారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆదాయం వచ్చేలా స్థిరాస్తులు కొనడం లేదా ఏదైనా ప్లాన్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయాలని అనుకుంటారు. ప్రభుత్వం రన్ చేస్తున్న పెన్షన్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడితే నష్ట భయం ఉండదు, రిటైర్ అయ్యాక కూడా డబ్బులు వస్తాయి. అలాంటి బెస్ట్ ప్లాన్స్ లో ఒకటి.. 'జాతీయ పింఛను పథకం' లేదా 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' (NPS). ఇంటి బడ్జెట్ మీద భారం పడకుండా తక్కువ మొత్తంలో NSPలో డబ్బును ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. 25 ఏళ్ల వయస్సు నుంచి నెలకి 3వేలు పెట్టుబడి పెట్టాలి. 60 ఏళ్లు వచ్చేసరికి ఆ డబ్బు రూ. 1,14,84,831 అవుతుంది. ఆ మొత్తంలో.. 100% యాన్యుటీ కొనుగోలు చేస్తే, నెలకు రూ. 57,412 పెన్షన్ వస్తుంది. 40% మొత్తంతో యాన్యుటీ కొనుగోలు చేస్తే నెలకు రూ. 22,970 పెన్షన్ వస్తుంది. మిలిగిన 60% కార్పస్ రూ. 68 లక్షలను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. NPS సబ్‌స్క్రైబర్లు, తమ పెట్టుబడిపై ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.