ఆదాయ‌పు ప‌న్ను విష‌యంలో సాధార‌ణ ప్ర‌జ‌ల కంటే.. 60 ఏళ్లు దాటిన వాళ్ల‌కి ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కి ఆర్థికంగా ఊర‌ట క‌లిగించేందుకు ఐటీఆర్ లో 80TTBని తెచ్చింది కేంద్రం.

ఆరేళ్ల క్రితం, 2018 కేంద్ర బడ్జెట్ సమయంలో ఈ సెక్షన్‌ను ప్రవేశపెట్టింది.

సెక్షన్ 80TTB కింద టాక్స్‌ బెనిఫిట్‌ పొందాలంటే ఉండాల్సిన ఏకైక అర్హత.. 60 సంవత్సరాల వయస్సు నిండడం.

సెక్షన్ 80TTB ప్రధాన లక్ష్యం.. 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులపై పన్ను భారాన్ని తగ్గించడం.

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్క్ కింద చేసే వివిధ డిపాజిట్‌లు నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై రూ. 50,000 క్లెయిమ్ చేయవచ్చు.

సెక్షన్ 194A కింద, సీనియర్‌ సిటిజన్లకు రూ. 50,000 వరకు ఉన్న వడ్డీ ఆదాయంపై బ్యాంకులు TDS తియ్య‌లేవు.

ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు, ఖ‌ర్చుల‌ను దృష్టిలో ఉంచుకుని పన్ను మిహాయింపు పరిమితిని రూ. 50,000 చేసింది కేంద్ర ప్రభుత్వం.

పన్ను పడకపోవడం వల్ల ఆదా అయిన డబ్బును మళ్లీ పెట్టుబడిగా వినియోగిస్తారన్న ఆలోచన కూడా.

సెక్షన్ 80TTA వల్ల సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం ఉండదు. సెక్షన్ 80TTB కింద మాత్రమే వాళ్లు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు.