యూత్ ని ఫిదా చేస్తున్న ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ తెలుసా? సోషల్ మీడియాలో సత్తా చాటి చాలా మంది మద్దుగుమ్మలు హీరోయిన్లుగా మారుతున్నారు. అలాంటి వారిలో 18 ఏండ్ల తెలుగమ్మాయి వర్షిణి వర్మ ఒకరు. ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. బన్నీ వాక్స్ పేరుతో నెట్టింట ఓ రేంజిలో ఫాలోయింగ్ సంపాదించింది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ భామకు సినిమా అవకాశం వచ్చింది. చేతన్ శీను-మధు మాదాసు కాంబోలో వస్తున్న ‘విద్యార్థి’ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అందం, అభినయంతో అలరించిన ఈమెకు మూవీ ఆఫర్ రావడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘విద్యార్థి’ సినిమాలో రఘుబాబు, జీవా లాంటి ప్రముఖ స్టార్లు నటించారు. సినిమా ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇటీవల ఆ సినిమా నుంచి విడుదలైన ఓ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తొలి సినిమా రిలీజ్ తరువాత వర్షిణి పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. Photos & Video Credit: Varshinne Varma/Instagram