కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2025-26లో పన్నుపై భారీ ఊరట కల్పించింది. తాజాగా రూ.12.75 లక్షల వరకు మినహాయింపు ఇచ్చింది

గత 20 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వాలు జాబ్ హోల్డర్స్, వ్యాపార వర్గాలకు తగ్గించిన ట్యాక్స్ మినహాయింపు వివరాలిలా ఉన్నాయి.

2005లో రూ.1 లక్ష నుంచి 2025లో రూ.12 లక్షల వరకు ప్రభుత్వాలు ట్యాక్స్ మినహాయింపు ఇస్తూ వెళ్లాయి

2005లో యూపీఏ ప్రభుత్వం రూ.1 లక్ష వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చింది

2014లో కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ లేదని ప్రకటించింది

2019లో ఎన్డీయే ప్రభుత్వం రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను ఎత్తివేసింది

2023లో మోదీ 2.0 ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త ట్యాక్స్ విధానంలో రూ.7 లక్షల వరకు మినహాయింపు ఇచ్చింది

2025లో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రూ.12 లక్షల వార్షిక ఆదాయం వరకు ట్యాక్స్ లేదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు