కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 50,65,345 కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టి, కీలక ప్రకటనలు చేశారు.

Published by: Khagesh

క్రెడిట్ కార్డుల జాతర

రూ.30వేల లిమిట్ తో పట్టణ పేదలకు UPI లింక్డ్ క్రెడిట్ కార్డులు, రైతులకు రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డుల లిమిట్ ను పెంచారు.

12 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు

కేంద్రం రూ.12లక్షల వరకు ఆదాయపు పన్నుపై మినహాయింపు ఇచ్చింది. అదనంగా రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రకటించింది

MSME లకు బడ్జెట్ 2025లో వరాలు

సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు MSMEలు ఏర్పాటుకు ఇచ్చే రుణాలను రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచారు

స్టార్టప్ లకు బడ్జెట్ ఊతం

స్టార్టప్‌లకు ఎగిరి గంతేసే వార్త. మీతో అద్భుతమైన ఐడియా ఉంటే చాలు రూ. 20 కోట్ల వరకూ కేంద్రం నుంచి రుణాలు పొందవచ్చు

మెడిసిన్‌‌పై కస్టమ్స్ సుంకం ఎత్తివేత

36 రకాల మెడిసిన్‌ను బేసిక్ దిగుమతి పన్ను నుంచి మినహాయించారు. రోగులకు ఉచితంగా ఇచ్చే మరో 37 మెడిసిన్‌పై కస్టమ్స్ డ్యూటీలో ఊరట కల్పించారు.

ఇన్సూరెన్స్ లో FDIకి పూర్తి వాటా

ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) వాటాను 74 శాతం నుంచి 100 శాతానికి పెంచినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు

అణు శక్తి భారత్

అణుశక్తి మీద ఫోకస్ చేసిన కేంద్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు