బడ్జెట్‌లో పేదరికం, మహిళలు, యువత, రైతులకు ప్రాధాన్యత ఈ బడ్జెట్‌లో కేంద్రం పన్ను విధానంలో కీలక మార్పులు చేసింది. కొత్త ట్యాక్స్ పాలసీతో ఉద్యోగులకు రూ.17,500 పన్ను ఆదా కానుంది. మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, ఛార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు బంగారం, వెండిపై పన్ను 6 శాతం, ప్లాటిన్‌పై పన్ను 6.4 శాతానికి కుదింపు ఏపీ, బిహార్‌కు బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయించింది. అమరావతికి 15 వేల కోట్ల ప్రత్యేక సాయం - పోలవరం త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు, సీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ బిహార్, అసోం, హిమాచల్ ప్రదేశ్‌కు వరద నివారణ కోసం ప్రత్యేక నిధులు స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం 11.11 లక్షల కోట్లు కేటాయింపు -గృహ నిర్మాణానికి 2.2 లక్షల కోట్లు కేటాయించింది. యువతకు ఉద్యోగ కల్పన కోసం 100 నగరాల్లో పారిశ్రామిక పార్కులు, 12 విస్తృత స్థాయి ఇండస్ట్రియల్ కారిడార్‌లు దేశీయ విద్యాసంస్థల్లో చదువుకోవడానికి విద్యార్థులకు 10 లక్షల వరకు రుణం