బడ్జెట్ ప్రవేశపెట్టడానికి తీసుకువచ్చే బ్రీఫ్ కేస్ చరిత్ర మీకు తెలుసా!

బడ్జెట్ పత్రాలను లెదర్ బ్రీఫ్ కేసులో పార్లమెంటుకు తీసుకువచ్చే సంప్రదాయం ఇంగ్లండ్ లో ప్రారంభమైంది

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు

ఇంగ్లాండ్ లో ఉపయోగించే బడ్జెట్ బ్రీఫ్ కేస్‌ను గ్లాడ్ స్టోన్ బాక్స్ అని పిలుస్తారు

బ్రిటన్ ఆర్థిక మంత్రి విలియం ఎడ్వర్డ్ గ్లాడ్ స్టోన్ తొలిసారి రెడ్ కలర్ లెదర్ బ్రీఫ్ కేసులో బడ్జెట్ ను సభకు తెచ్చారు

2010 వరకు బ్రిటన్ నేతలు ఎరుపు రంగు గ్లాడ్ స్టోన్ బ్రీఫ్ కేసునే బడ్జెట్‌కు వినియోగించారు

భారత్‌లో ఆర్థిక మంత్రులు ప్రతి బడ్జెట్ కు డాక్యుమెంట్స్ ను రకరకాల బ్రీఫ్ కేసులలో పార్లమెంట్‌కు తెచ్చేవారు

గతంలో ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ డార్క్ లెదర్ బ్రీఫ్ కేస్‌లో బడ్జెట్ పత్రాలు సభకు తీసుకువచ్చారు.

ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ నలుపు రంగు బ్రీఫ్ కేస్‌తో వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారు

2018- 19లో తొలిసారి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లెదర్ బ్రీఫ్ కేసులో కాకుండా బహిఖాతా అనే రెడ్ వెల్వెట్ క్లాత్ లో పత్రాలు సభకు తెచ్చారు

1998-99లో అప్పటి ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా తొలిసారి స్ట్రాప్స్, బకెల్స్ ఉన్న బ్లాక్ లెదర్ బ్రీఫ్ కేసులో బడ్జెట్ తీసుకొచ్చారు

‘డిజిటల్ ఇండియా’లో భాగంగా నిర్మలా సీతారామన్ 2020-21లో ట్యాబ్ ద్వారా పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.

మొట్టమొదటి బడ్జెట్‌ను 1947-48 సంవత్సరానికి ఆర్‌.కె. షణ్ముఖచెట్టి బ్రీఫ్ కేస్‌లో తెచ్చి ప్రవేశపెట్టారు