ఆయుష్మాన్ భారత్ నుంచి ఆదాయపు పన్ను వరకూ - బడ్జెట్ టాప్ హైలైట్స్ కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని కీలక ప్రకటన విమానయాన రంగంలో టైర్ 2, 3 నగరాలకు కొత్త విమాన సర్వీసులు. రైలు మార్గాల్లో నూతన మౌలిక సదుపాయాలు ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకూ మినహాయింపు సంస్కరణల అమలు కోసం రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు రక్షణ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచేలా అమల్లోకి కొత్త పథకం అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకూ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల కోసం త్వరలోనే కొత్త హౌజింగ్ స్కీమ్ ప్రకటన, రానున్న ఐదేళ్లలో అర్హులకు 2 కోట్ల ఇళ్ల నిర్మాణం జన్‌ధన్ ఖాతాల ద్వారా పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించామన్న కేంద్రం పంట బీమా కింద 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుందన్న నిర్మలా సీతారామన్ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారంటీ అన్న ప్రధాని మోదీ