K-పాప్ బ్యాండ్ BTS దేశ సేవ కోసం క్యూలైన్ కడుతున్నారు. ఇప్పటికే JIN, SUGA, J-HOPE మిలటరీలో తమ సేవలు అందిస్తున్నారు. తాజాగా V, RM, Jung Kook, Jimin తమ ఎన్లిస్ట్ డేట్లు వెల్లడించారు. అయితే డిసెంబర్ 11వ తేదీన V, RM సైన్యంలో జాయిన్ కానున్నారు. Jung Kook, Jimin డిసెంబర్ 12వ తేదీన జాయిన్ అవ్వనున్నారు. దక్షిణ కొరియాలో 18-28 ఏళ్ల మధ్యనున్న పురుషులు సైన్యంలో సేవలు చేయాలి. అక్కడి ప్రభుత్వం BTS సభ్యులకు 30 ఏళ్లలోపు చేరేలా నియమాన్ని సడలించింది. ఈ నింబధనలకు అనుగుణంగా BTS సభ్యులు ఎన్లిస్ట్ చేసుకున్నారు. (Image Source : Pinterest)