డిసెంబర్ 1వ తేదీన విడుదల అయిన ‘యానిమల్’ వసూళ్లలో దూసుకుపోతుంది.

ఆదివారంతో రూ.700 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది.

ఇదే సంవత్సరం షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ కూడా ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.

వీటిలో జవాన్ రూ.640 కోట్లకు పైగా, పఠాన్ రూ.540 కోట్లకు పైగా నెట్‌ను వసూలు చేశాయి.

‘జవాన్’కి, ‘పఠాన్’కి మధ్య సన్నీ డియోల్ ‘గదర్ 2’ కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.520 కోట్ల నెట్ సాధించింది.

2017లో వచ్చిన ‘బాహుబలి 2’ కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా హిందీ వెర్షన్ రూ.511 కోట్ల నెట్ సాధించింది.



2022లో వచ్చిన ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ ఇండస్ట్రీ హిట్ కాకపోయినా రూ.430 కోట్లకు పైగా వసూలు చేసింది.

రూ.400 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో సినిమాగా నిలిచింది.