రొమ్ము కణజాలాల్లో పెరిగే క్యాన్సర్ ను బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఇది స్త్రీ పురుషులెవరికైనా రావచ్చు. కానీ స్త్రీలలో ఎక్కువ. రొమ్ము కణజాలాల్లో చిన్న కణితిలా క్యాన్సర్ కణాలు పెరుగుతాయి. బాహుమూలల్లో, రొమ్ముల్లో కణితులు ఏర్పడడం, రొమ్ముల పరిమాణం, ఆకృతిలో మార్పు రావడం క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. రొమ్ముల చర్మం, చనుమొనల్లో మార్పులు, రొమ్ముల్లో నొప్పి ఉండడం, బరువుతగ్గడం, నీరసంగా ఉండడం బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల కావచ్చు. రొమ్ముల స్వీయ పరీక్ష క్యాన్సర్ నివారణలో చాలా ముఖ్యం. తాకినపుడు కణితులు ఉన్నట్టు అనిపిస్తే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించేందుకు మామోగ్రామ్, జెనెటిక్ టెస్టింగ్, బయాప్సీ వంటి పరీక్షలు అవసరమవుతాయి. రొమ్ములో ఎలాంటి మార్పులు కనిపించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది చికిత్సకు, రోగ నిర్థారణకు ప్రత్యామ్నాయం కాదు. Images courtesy : Pexels