బ్రేక్ ఫాస్ట్ ఈ సమయానికి తినేయాలి



బ్రేక్ ఫాస్ట్ తినేందుకు సరైన సమయం ఉంటుంది. కానీ ఆ సమయానికి కచ్చితంగా తినేవారు చాలా తక్కువ మంది.



చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ఉదయం పది తరువాత తింటూ ఉంటారు. అప్పుడు తినడం వల్ల ఉపయోగం లేదు.



బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా ఉదయం 8లోపు తినేయాలి. అదే సరైన సమయం.



ఎవరైతే ఉదయం 8లోపు బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేస్తారో వారికి మధుమేహం వచ్చే అవకాశం 59 శాతం తగ్గుతుంది.



మన తిండి వేళలు రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్ మోతాదుల నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.



కేవలం బ్రేక్ ఫాస్ట్ సమయమే కాదు, రాత్రి భోజనం కూడా పది గంటల తరువాత తింటే మధుమేహం ముప్పు పెరుగుతుంది.



రాత్రి ఆహారం ఏడు గంటల్లోపు తింటే మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది.



సరైన సమయానికి ఆహారాన్ని తినడం వల్ల ఎన్నో రకాల రోగాలను తగ్గించుకోవచ్చు.