బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ ‘పఠాన్’ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. అవేంటో చూద్దాం. మొదటిరోజు పఠాన్ రూ.55 కోట్లు (నెట్) వసూలు చేసింది. ఇది ఆల్ టైం రికార్డు. ప్రపంచవ్యాప్తంగా మొదటి వీకెండ్‌లో రూ.540 కోట్ల గ్రాస్‌ను సాధించింది. బాలీవుడ్ సినిమాల్లో ఇదే అత్యధికం. విడుదలైన రెండో రోజు ఏకంగా రూ.70 కోట్లు (నెట్) వచ్చాయి. ఇంకే సినిమా కనీసం రూ.55 కోట్లు కూడా దాటలేదు. బాలీవుడ్ మార్కెట్లో రూ.100, రూ.200 కోట్లు, రూ.300 కోట్లు నెట్ వసూళ్లను వేగంగా సాధించిన సినిమా. అమెరికాలో కేవలం ఐదు రోజుల్లోనే 9.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. యూకేలో ఓపెనింగ్ డే, సింగిల్ డే, వీకెండ్ రికార్డులు తిరగరాసింది. యూకేలో పఠాన్ మొదటి వీకెండ్‌లోనే 2.45 మిలియన్ యూరోలు సాధించింది. ఇప్పటికి పఠాన్ రూ.700 కోట్ల వసూళ్లను దాటింది.