పరమ బోరింగ్ ఉద్యోగాలు ఇవే యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ కు చెందిన సైకాలజీ పరిశోధకుల బృందం ప్రపంచంలోని ఏ ఉద్యోగాలు పరమ బోరింగో తెలుసుకోవాలనుకున్నారు. పరిశోధనలో అయిదు రకాల ప్రయోగాలలో 500 మంది వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్న వారి జీవనశైలిని తెలుసుకున్నారు. వారు చెప్పిన దాన్ని ప్రకారం ఓ డేటా సిద్ధం చేశారు. దాన్ని బట్టి అయిదు పరమ బోరింగ్ ఉద్యోగాలేంటో తేల్చి చెప్పారు. డేటా అనలిస్టు అకౌంటింగ్ అండ్ టాక్స్ కన్సల్టెన్సీ ఉద్యోగులు క్లీనింగ్ రంగంలోని వారు బ్యాంకింగ్ ఉద్యోగులు ఫైనాన్స్ ఉద్యోగులు ఈ ఉద్యోగాల్లో మీరూ ఉన్నారా? మీకు కూడా లైఫ్ బోరింగ్ అనిపిస్తోందా? లైఫ్ లో మరింత జోష్‌ను నింపుకునేందుకు ప్రయత్నించండి.