బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే తన లేటెస్ట్ ఫోటోలలో ఎల్లో శారీలో మెరిసింది. 'డ్రీమ్ గర్ల్ 2' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రంగు రంగుల చీరలు ధరించి రకరకాల ఫోజులు ఇస్తోంది. ఎప్పుడూ ట్రెండీ దుస్తుల్లో హాట్ హాట్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు శారీల్లో సందడి చేస్తోంది. చీర కట్టులో అమ్మడి జీరో సైజు నడుము అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' మూవీతో టాలీవుడ్ అడుగుపెట్టింది అనన్య. 'పతి పత్ని ఔర్ ఓహ్', 'గెహ్రైయాన్', 'ఖాలీ పీలీ' సినిమాలు ఈ బ్యూటీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి అనన్య నటించిన 'డ్రీమ్ గర్ల్ 2' ఆగస్టు 25న విడుదల కాబోతోంది. 'ఖో గయే హమ్ కహాన్' 'కంట్రోల్' వంటి మరో రెండు చిత్రాల్లో ఈ అందాల భామ నటిస్తోంది.