2022లో తన నిర్ణయాల గురించి ఆలియా భట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. వర్క్, ప్రైవేట్ లైఫ్ గురించి తన హృదయం చెప్పిన మాటలు విన్నానని తెలిపింది. 2022లో తాను ఎంతో ఆనందంగా ఉన్నట్లు పేర్కొంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు కూతురు రాహా కపూర్‌ను కన్నందుకు ఎటువంటి బాధ లేదంది. ఆలియా, రణ్‌బీర్‌లకు 2022 ఏప్రిల్ 14వ తేదీన వివాహం జరిగింది. ముంబైలో వారి వివాహం జరిగింది. నవంబర్‌లో వారికి కూతురు పుట్టినట్లు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో తప్పు, కరెక్ట్ అనేవి ఏమీ లేవని చెప్పారు. మన హృదయానికి నచ్చింది చేసుకుంటూ వెళ్లడమే మంచిదని అన్నారు. ఆలియా ప్రస్తుతం కరణ్ జోహార్ సినిమా ‘రాకీ అవుర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’లో నటిస్తున్నారు.