గుడ్డు లో ప్రొటీన్ పుష్కలం. సాధారణంగా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటారు.

ఒక గుడ్డులో 72 క్యాలరీలు ఉంటాయి. 6గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కొవ్వులు, ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి.

గుడ్డు ఉడికించి లేదా ఆమ్లేట్ గా తీసుకుంటారు. అయితే ఏది ఎక్కువ పోషకాలతో ఉంటుంది?

గుడ్డులో శరీరానికి అవసరమ్యే అన్ని రకాల ఆవశ్యక అమైనో ఆసిడ్లు ఉంటాయి.

గుడ్డు ఉడికించినపుడు దానిలో పోషకాలన్నీ కూడా నిలిచి ఉంటాయి. ఉడికించిన గుడ్డు తీసుకోవడం మంచి చాయిస్.

ఆమ్లెట్ తయారీలో కూరగాయలు, చీజ్ వంటివి అదనంగా చేరుస్తారు. వాటిలో కూడా అదనపు క్యాలరీలు, కొవ్వులు ఉండొచ్చు.

ఆమ్లెట్ లో అదనంగా చేర్చిన పదార్థాలను బట్టి దాని పోషక విలువలు ఆధారపడి ఉంటాయి.

ఉడికించినపుడు గుడ్డుకు అదనంగా మరేమీ చేర్చరు కనుక అదనంగా క్యాలరీలు చేరవు, పోషకాలన్నీ కూడా ప్రిజర్వ్ చెయ్యబడి ఉంటాయి.

నూనెలో వండడం వల్ల ఆమ్లెట్ లో సంతృప్త కొవ్వులు చేరుతాయి కనుక ఉడికించిన గుడ్డుతోనే లాభాలు ఎక్కువ.

Represental Image : pexels