నల్లని ద్రాక్షల్లో సాధారణంగా రెస్వెరట్రోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ.

అన్ని రంగుల ద్రాక్షలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ నల్ల ద్రాక్షల్లో మిగతా వాటికంటే ఎక్కువ విటమిన్లు సి, కె ఉంటాయి.

నల్ల ద్రాక్షలో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ.

రెస్వెరట్రోల్ వల్ల నల్లద్రాక్షలు రక్తనాళాల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ను నివారిస్తాయి.

ఏ రంగు ద్రాక్షలోనైనా సహజమైన చక్కెరలు ఉంటాయి.

నల్లద్రాక్షలో ఫైబర్ ఎక్కువ కనుక మిగతా వాటితో పోలిస్తే మధుమేహులకు మేలైనవిగా చెప్పవచ్చు.

ద్రాక్షలు విరివిగా దొరికే ఈ సీజన్ లో తప్పక తీసుకోవాలి. కానీ మోతాదు మించితే వీటితో బరువు పెరగవచ్చు.

మధుమేహులు ద్రాక్షపండ్లు తక్కువ మోతాదులో వినియోగించడం మంచిది. వీటిలో చక్కెరలు ఎక్కువ.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.
Images courtesy : Pexels