రీజన్ ఇదే

బిగ్​బాస్ నామినేషన్స్​లో ప్రేరణ లేకపోవడానికి కారణమిదే?

Published by: Geddam Vijaya Madhuri

ట్విస్ట్​లు ఉన్నాయట

బిగ్​బాస్​ సీజన్ మొదలవ్వగానే నాగార్జున ఈ సారి ట్విస్ట్​లు ఎవరూ ఊహించని రేంజ్​లో ఉంటాయంటూ చెప్పారు.

టీమ్ కష్టాలు

దానికి తగ్గట్లు బిగ్​బాస్​ టీమ్ ట్విస్ట్​లు ఇచ్చేందుకు తెగ కష్టపడుతుంది. అందుకే ఈ వారం నామినేషన్స్​లో ఓ ట్విస్ట్ పెట్టింది.

సూపర్ పవర్

ఇప్పటికే నామినేషన్స్​ నుంచి యశ్మీని మినహాయించిన బిగ్​బాస్​.. ఆమెకు ఓ సూపర్ పవర్ ఇచ్చాడు.

నేరుగా నామినేట్ చేయొచ్చు

అందరి నామినేషన్స్ ముగిసిన తర్వాత ఆమెకు నామినేషన్స్​లో ఉన్నవారిని సేవ్ చేసి.. నామినేట్ కానీ వారిని నేరుగా నామినేట్ చేసే పవర్ ఇచ్చాడు.

ప్రేరణకు పచ్చజెండా

దీంతో యశ్మీ దొరికిందే తంతు అనుకుంటూ ప్రేరణను ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ చేసింది.

పాపం విష్ణుప్రియ

నామినేషన్​లో లేని విష్ణుప్రియను నేరుగా నామినేట్ చేసింది. దీంతో విష్ణు ఈ వారం కూడా నామినేషన్​లో ఉంది.

స్ట్రాంగ్ కంటెస్టెంట్

ప్రేరణ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ.. ఆమెను ఎలా నామినేట్ చేశారంటూ యశ్మీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

మంచి టాకే ఉంది

అయితే విష్ణు ప్రియ తన బిహేవియర్​తో మంచి పబ్లిక్ టాక్ సంపాదించుకుంది. ముఖ్యంగా సోనియా గొడవలో ఆమె మెచ్యూర్డ్​గా బిహేవ్ చేసిందంటున్నారు.

తింగరి పిల్ల

తన విషయానికొస్తే స్టాండ్ తీసుకుంటుంది కానీ.. కాస్త తింగరిగా బిహేవ్ చేస్తుందంటున్నారు.