శ్రీహన్, సిరి లవ్ స్టోరీ - ట్వీస్ట్ మీద ట్విస్ట్, భలే ఇంట్రెస్టింగ్‌గా ఉందే! యూట్యూబర్ సిరి బాయ్ ఫ్రెండ్ శ్రిహాన్ కూడా ఇప్పుడు ‘బిగ్ బాస్’కు వెళ్లాడు. సిరి-శ్రీహన్‌ల ప్రేమ ఫలించి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్‌లు వల్లే సిరి-శ్రీహన్‌లు కలిశారు. శ్రీహన్ ప్రపోజ్ చేస్తాడని సిరి చానాళ్లు వెయిట్ చేసిందట. కానీ, చేయలేదు. చివరికి సిరి ఓ రోజు వైజాగ్ బీచ్‌లో శ్రీహన్‌కు ‘ఐ లవ్ యూ’ చెప్పేసింది. ట్విస్ట్ ఏమిటంటే, శ్రీహన్ ఆ రోజు సిరి ప్రేమను రిజెక్ట్ చేశాడు. ఇందుకు కారణం సిరి హిందూ, శ్రీహన్ ముస్లిం. అప్పటికి సిరికి 19 ఏళ్లే. అయితే, వారం రోజుల తర్వాత శ్రీహన్ స్వయంగా సిరికి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరు సహజీవనం చేయడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించారు. వీరిద్దరు ఓ బాల నటుడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. సిరి ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటకు వచ్చాక శ్రీహన్ పెళ్లి చేసుకుంటా అన్నాడు. కానీ, ‘బిగ్ బాస్’లో సిరి ఏం చేసిందో మీకు తెలిసిందే. పెళ్లి ఎప్పుడనేది ఇప్పట్లో చెప్పడం కష్టమే. Images Credit: Siri Hanumanthu, Shrihan/Instagram