శోభా శెట్టి.. బిగ్‌బాస్ సీజన్ 7 ముందువరకు ఈ పేరు పెద్దగా పరిచయం లేదు 'కార్తీక దీపం' మోనిత అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు.. అంతగా నెగిటివ్ రోల్లో ఆకట్టుకుంది అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 7 సీజన్‌లో అడుగుపెట్టి మోనిత గుర్తింపును తుడిచిపెట్టాలనుకుంది శోభా శెట్టిగా అందరి గుండెల్లో నిలిచిపోవాలని హౌజ్‌లోకి వచ్చిన ఆమెకు ఇక్కడ కూడా నెగిటివ్ ఇంప్రెషనే పడింది బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో అందరి కంటే ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైంది శోభా అనే చెప్పాలి ఏదైనా తనకే కావాలన్న స్వార్థం, ఓటమిని అంగీకరించలేని తత్వం, ప్రతిదానికి గోడవపడే వైఖరి వల్లే ఆమె తీవ్ర విమర్శలకు గురైంది తన తీరుకు చూసి చాలామంది శోభా ఎలిమినేట్ అయితే బెస్ట్ అంటూ కామెంట్స్ చేసేవారు కానీ ప్రతీ టాస్క్‌ను ఛాలేంజింగ్‌గా తీసుకుని శివంగిలా పోరాడే ఆమె గుణానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఇక హౌజ్ నుంచి బయటకు రాగానే ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న శోభా తన ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట యాక్టివ్‌గా ఉంటుంది తాజాగా కాటన్ చీరలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. వాటిని వరుసగా షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది