ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది.   



ఏ సీజన్ లో కూడా లేడీ కంటెస్టెంట్ విన్నర్ కాలేదు.



తొలిసారి బిగ్ బాస్ తెలుగులో లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచింది. ఆమె మరెవరో కాదు.. బిందు మాధవి.



బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన బిందు మాధవి తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది.



ఫిజికల్ టాస్క్ లకు దూరంగా ఉన్నా.. తన మాటలు, ఆలోచనా తీరుతో అందరినీ మెప్పించింది. 



హౌస్ లో ఎన్ని గ్రూప్స్ ఉన్నా.. సోలోగా గేమ్ ఆడేది. ఒక్క శివతో మాత్రమే క్లోజ్ గా ఉండేది.



ఫైనల్స్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా.. టాప్ 2లో అఖిల్, బిందు నిలిచారు.



వారిద్దరినీ స్టేజ్ పైకి తీసుకొచ్చిన నాగ్.. కాసేపు టెన్షన్ పెట్టి బిందు మాధవిని విన్నర్ గా అనౌన్స్ చేశారు. 



అఖిల్ ఎంత కష్టపడి ఆడినా.. బిందు మాధవి టైటిల్ కొట్టేసి అతడికి షాకిచ్చింది.



మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచి చరిత్ర సృష్టించింది.