సింగర్ రేవంత్ డబుల్ ధమాకా- ఒక చేతిలో పాప, మరో చేతిలో బిగ్ బాస్ ట్రోఫీ! బిగ్ బాస్-6 తెలుగు విన్నర్ గా నిలిచాడు సింగర్ రేవంత్. బిగ్ బాస్ టైటిల్ తో ఇంటికెళ్లిన ఆయనకు ఫ్యామిలీ మెంబర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. తన ముద్దుల కూతురిని చేతిలో పెట్టారు. తొలిసారి తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని తండ్రిగా ఎంతో మురిసిపోయాడు. బిడ్డకు ముద్దులు పెడుతూ తన్మయత్వం చెందాడు. చిన్నారిని చూసి సంతోషంలో మునిగిపోయాడు. ఓ చేతిలో కూతురిని, మరో చేతిలో బిగ్ బాస్ టైటిల్ ను పట్టుకుని సంతోషం వ్యక్తం చేశాడు. కూతురితో బిగ్ బాస్ విన్నర్ అపురూప వీడియో మీరూ చూసేయండి! Photos & Video Credit: 𝐀𝐍𝐕𝐈/Instagram