డాక్టర్ మోనిత పాత్రలో తెలుగింటి ప్రేక్షకుల ఆదరణ అందుకొన్న తన అస్సలు పేరు శోభ శెట్టి. మోనిత పాత్రతో ఆమె యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న శోభాశెట్టి.. 'అగ్నిసాక్షి' అనే కన్నడ సీరియల్ తో నటనను ప్రారంభించింది. తెలుగులో 'అష్టా చమ్మా' సిరియల్‌తో కేరీర్‌ను ప్రారంభించింది. 2017లో పునీత్ రాజ్ కుమార్, రష్మిక మందాన్న నటించిన 'అంజనిపుత్రా' సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. శోభశెట్టి సోషల్ మీడియాలోను యాక్టీవ్‌గా ఉంటుంది. ఈమెకు ప్రత్యేకంగా యూట్యూబ్ చానెల్ ఉంది. 2018లో ప్రారంభమైన 'కార్తిక దీపం' సీరియల్ తో శోభ అభిమానులను సంపాదించుకుంది. తరువాత వరుసగా 'లాహిరి లాహిరి లాహిరిలో', 'అత్తారింటికి దారేది', 'హిట్లర్ గారి పెళ్ళాం' సీరియళ్ళలో నటించింది. తాజాగా 'కార్తిక దీపం' సిరియల్ కు గుడ్‌బై చెప్పేసింది శోభా శెట్టి. Image Credit: Shobhashetty/Instagram