'బిచ్చగాడు' హిట్ తర్వాత విజయ్ ఆంటోనీకి తెలుగు సాలిడ్ హిట్ పడలేదు. మరి, 'బిచ్చగాడు 2' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది?

'బిచ్చగాడు 2' నైజాం థియేట్రికల్ రైట్స్ రూ. 2.2 కోట్లకు విక్రయిచినట్లు తెలిసింది. 

సీడెడ్ 'బిచ్చగాడు 2' రైట్స్ ద్వారా కోటి రూపాయలు వచ్చాయట!

ఆంధ్ర ఏరియాలో 'బిచ్చగాడు 2' థియేట్రికల్ రైట్స్ సుమారు రూ. 2.8 కోట్ల రూపాయలు అని టాక్.

ఏపీ, తెలంగాణలో 'బిచ్చగాడు 2' థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు రూ. 6 కోట్లు వచ్చాయి.

తెలుగులో 'బిచ్చగాడు 2'కు ఆరున్నర కోట్ల రూపాయల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్లు!

తమిళనాడు, ఓవర్సీస్ రైట్స్ ద్వారా 'బిచ్చగాడు 2'కు రూ. 10 కోట్లు వచ్చాయట! సో... సుమారు 17 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్!

తెలుగులో సుమారు 300 థియేటర్లలో 'బిచ్చగాడు 2' విడుదల అవుతోంది. విజయ్ ఆంటోనీకి ఇది భారీ రిలీజ్!

'బిచ్చగాడు 2' సినిమాకు విజయ్ ఆంటోనీ డైరెక్షన్ చేశారు. హీరోగానే కాదు, ఈ సినిమా విజయం దర్శకుడిగా కూడా ఆయన కీలకం!