బాలకృష్ణ, అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ దగ్గర నుంచి మంచి టాక్‌ను అందుకుని కలెక్షన్లలో దూసుకుపోతుంది. ప్రారంభంలో ‘లియో’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాల నుంచి గట్టిపోటీని అందుకుంది. కానీ మిక్స్‌డ్ టాక్ కారణంగా ‘లియో’ తెలుగులో నెమ్మదించింది. మరోవైపు ‘టైగర్ నాగేశ్వరరావు’ కూడా నిడివి కారణంగా ప్రారంభంలో కాస్త మిక్స్‌డ్ టాక్ పొందింది. ఇది ‘భగవంత్ కేసరి’కి అడ్వాంటేజ్ అయింది. మొదటి 10 రోజుల్లో ‘భగవంత్ కేసరి’ ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్ల వరకు షేర్ అందుకుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు రూ.108 కోట్ల వరకు ఉన్నాయి. సినిమా బిజినెస్ రూ.68 కోట్లు కాగా, మరో రూ.8 కోట్లు వస్తే బాక్సాఫీస్ వద్ద గట్టెక్కేస్తుంది.