పాలక్ పనీర్ తినకపోవడమే బెటర్

రోటి, చపాతీలతో పాలక్ పనీర్ ఇష్టంగా తింటారు చాలా మంది. ఇది ఎంతో ఫేమస్ కర్రీ.

విడివిడిగా చూస్తే పాలకూర, పనీర్ రెండూ ఆరోగ్యకరమైనవే. కానీ కలిపి తింటే మాత్రం అనారోగ్యకరం.

పాలకూరలో ఇనుము అధికంగా ఉంటుంది. ఇక పనీర్ లో కాల్షియం అధికంగా ఉంటుంది.

ఈ రెండింటినీ ఒకేసారి తినడం వల్ల ఇనుము, కాల్షియం ఒకదాని శోషణను మరొకటి అడ్డుకుంటాయి.

ఈ రెండూ కలిపి తినడం వల్ల శరీరం ఏ పోషకాన్ని శోషించుకోలేదు.

ఆహారంలోని పోషకాలు శరీరం సరిగ్గా శోషించుకుంటేనే అవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

పాలక్ పనీర్ తినడం ఆ రెండింటిలో ఉండే పోషకాలను శరీరం శోషించుకోదు.

కాబట్టి పాలక్, పనీర్ తినడం వల్ల రుచి తప్ప పోషకాలేవీ శరీరానికి అందవు.