కొత్త ఏడాదిని సరికొత్తగా ఆహ్వానిద్దాం అనుకునేవారికోసం ఓ పది మంచి ప్రదేశాలివి…
కేరళ: భూతల స్వర్గంలా ఉండే కేరళ ఆందాలను ఆస్వాదిస్తూ కొత్త ఏడాదికి వెల్ కమ్ చెప్పొచ్చు. ముఖ్యంగా అలెప్పీ, మున్నార్, కోవలం అధ్భుతం
గోవా: ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కి గోవాని మించిన మంచి ప్లేస్ లేదంటారు పర్యాటకులు
ముంబై: ఎంత అన్వేషించినా తీరని ఆకర్షణ ముంబై నగరం సొంతం. ఇయర్ ఎండ్ సందర్శించడానికి బెస్ట్ ప్లేస్.
జైపూర్: పింక్ సిటీ అని పిలిచే జైపూర్ పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో సందర్శించడానికి అనువైన నగరం
పుదుచ్చేరి: సహజ సౌందర్యాన్ని నింపుకున్న పుదుచ్చేరి ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల పర్యాటకులను ఆకర్షిస్తుంది. థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
మైసూర్, కూర్గ్-కర్ణాటక: ఎత్తైన పర్వతాలు, నిరంతరం పొగమంచుతో కూడిన ప్రకృతి దృశ్యాలెన్నో కూర్గ్ లో చూడొచ్చు. మైసూర్ కూడా ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్ కి బెస్ట్ డెస్టినేషన్.
కచ్, గుజరాత్: భారతదేశంలోని ప్రధాన భూభాగం నుంచి వేరు చేసిన ఒక ద్వీపం ఇది. ఇక్కడ ప్రసిద్ధ ల్యాండ్‌మార్క్‌లు, పురాతన దేవాలయాలు, పాత గుహలు చూడొచ్చు. శీతాకాలంలో జరిగే వార్షిక రన్ మహోత్సవ్ ఈ ద్వీపానికి ప్రత్యేక ఆకర్షణ.
అరకు-ఆంధ్రప్రదేశ్: మంచుదుప్పటి కప్పుకున్న గిరుల సోయగాలు, చినుకు తడికి మెరిసిపోయే పచ్చదనం, అడుగడుగునా మనసుని కట్టిపడిసే అపూర ప్రదేశాలెన్నో ఆంధ్రా ఊటీ అరకు సొంతం. కూల్ వెదర్లో న్యూ ఇయర్ కి హాట్ వెల్ కమ్ చెప్పేందుకు బెస్ట్ ప్లేస్..
లక్షద్వీప్: అరేబియా సముద్రంలో ఉన్న సహజమైన, అందమైన ద్వీపాల సమూహం. మనదేశంలో అత్యంత అందమైన ద్వీప సమూహాల్లో ఒకటి. పాత ఏడాదికి బైబై చెప్పి కొత్త ఏడాదిని ఆహ్వానించేందుకు బెస్ట్ వార్మ్ ప్లేస్.
పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు: అందమైన బీచ్‌లు, ఆంత్రోపోలాజికల్ మ్యూజియంలు, కలోనియల్ జైళ్లు ఉన్న ప్లేస్ ఇది. ఈ బీచ్‌లలో సన్ బాత్ చేయడం అత్యుత్తమ అనుభూతి.