గ్రీన్ టీ ఏ టైంలో తాగితే ఆరోగ్యానికి మంచిదంటే?

గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం కావడంతో పాటు బోలెడు లాభాలున్నాయి.

అయితే, గ్రీన్ టీ ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదంటున్నారు నిపుణులు.

గ్రీన్ టీ మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు తీసుకుంటే మంచిది.

సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలోనూ గ్రీన్ టీ తాగవచ్చు.

ఈ సమయంలో గ్రీన్ టీ తాగితే శరీర మెటబాలిజం పెరిగి క్యాలరీలు బర్న్ అవుతాయి.

గ్రీన్ టీని పరగడుపున తాగితే కాలేయంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.

రాత్రిపూట గ్రీన్ టీ తాగితే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.

మెడిసిన్ తీసుకున్న వెంటనే గ్రీన్ టీ అస్సలు తాగకూడదు.

రోజుకు 3 కప్పులకంటే ఎక్కువ గ్రీన్ టీ తీసుకోకూదడంటున్నారు నిపుణులు. All Photos Credit: Pexels.com