నువ్వు నేను (2001)
ఈ సినిమా కాలేజీలో ఓ ప్రేమజంట చుట్టూ తిరుగుతూ ఉంటుంగి. యూత్ ఫుల్ రొమాంటికా డ్రామగా సాగిన ఈ స్టోరీలో ఇంట్రస్టింగ్ సీన్స్, సాంగ్స్, మ్యూజిక్ అన్నీ ప్రేక్షకులన్నీ ఇట్టే ఆకర్షిస్తాయి. పెద్దలు తమ ప్రేమను కాదన్నా చివరకి యూత్ సహాయంతో పెళ్లి చేసుకునే నిరూపించే హీరోయిజం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫీల్ గుడ్ మూవీ అనుభూతిని కలిగిస్తుంది.

బొమ్మరిల్లు (2006)
ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో.. తండ్రీ, కొడుకుల మధ్య బంధాన్ని, ప్రేమను చక్కగా చూపించారు. కొడుకు మీద అతి ప్రేమతో తండ్రి తీసుకునే నిర్ణయాలు, కొడుకు పడే ఇబ్బందులు.. మధ్యలో సునీల్ తో కామెడీ సీన్స్.. మొత్తంగా ఓ ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ గా సాగుతుంది.

హ్యాపీ డేస్ (2007)
కళాశాలలో స్నేహితులు, వారి పరిచయాలు, ప్రేమ.. తదితర అంశాలను, వారి జీవితాలను చాలా చిత్రీకరించారు. కాలేజ్ డేస్ లో యువత ఎలా ఉంటారు.. మళ్లీ ఉద్యోగంలో స్థిరపడ్డాక వారి ఆలోచనలు ఎలా ఉంటాయి.. జీవితంలో ఫ్రెండ్స్ ఎంత ముఖ్యం అనేది కూడా ప్రేక్షకులను ఎక్కడికో తీసుకెళ్తుంది.

అలా మొదలైంది (2011)
ప్రేక్షకులను అలరించే, ఆనందాన్నిచ్చే హాస్యం, ప్రేమతో కూడిన అలా మొదలైంది.. ఎప్పడు చూసినా కొత్త అనే ఫీలింగ్ నే తెస్తుంది. నటీనటుల ఉద్వేగాలు, వారి మధ్య సాగే కెమిస్ట్రీ.. చాలా నీట్ గా అనిపిస్తాయి. ఈ మూవీలోనూ కామెడీ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు.

మనం (2014)
ఒక్క సినిమాతో అక్కినేని ఫ్యామిలీ మెంబెర్స్ అందర్నీ చూపించేశారు. ప్రేమ, భావోద్వేగాలు, ఆసక్తికర సన్నివేశాలు మూవీలో చాలానే ఉన్నాయి. అక్కినేని చివరి చిత్రం ఇదే కావడం, అది కూడా తన వాళ్ళందరితో కలిసి నటించడం మరో ముఖ్య విషయం.

పెళ్లి చూపులు (2016)
మ్యాచ్ మేకింగ్ సెషన్ లో కలుసుకున్న వ్యక్తుల ప్రయాణాన్ని, ఆ జర్నీలో వాళ్ళు ఎదుర్కొనే పరిణామాలను చక్కగా, నీట్ గా చూపించారు. మెయిన్ గా హీరో ఫ్రెండ్ గా చేసిన ప్రియదర్శిని క్యారెక్టర్.. ఎంతో ఫన్నీగా అనిపిస్తుంది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం మొత్తంగా ఎంతో అనుభూతిని కలిగిస్తుంది.

ఫిదా(2017)
2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఓ ఎన్నారై బ్రదర్స్.. పెళ్లి కోసం ఇండియాకు వస్తారు. హీరోయిన్ అక్కతో హీరో అన్నకు పెళ్లి తర్వాత.. హీరోహీరోయిన్ల మధ్య సాగే లవ్ సీన్స్, మధ్యలో పల్లెటూరి ప్రాముఖ్యత, ముఖ్యంగా తెలంగాణ యాస ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

గీత గోవిందం (2018)
2018లో రిలీజైన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం.. ఎలాంటి అంచనాల్లేకుండా భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. అనుకోకుండా కలిసిన ఓ అమ్మాయితో పరిచయం, ప్రేమగా మారి.. పలు నాటకీయ పరిణామాల క్రమంలో పెళ్లికి దారి తీస్తుంది. సినిమాలోని సాంగ్స్, కామెడీ సీన్స్ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్.

ఈ నగరానికి ఏమైంది (2018)
తమ కలలను నెరవేర్చుకోవడానికి రోడ్ ట్రిప్ కు బయలుదేరిన నలుగురు స్నేహితుల జర్నీని తెలిపే సూపర్ కామెడీ ఫిల్మ్. చిత్రంలోని చమత్కారమైన సంభాషణలు, నటీనటుల పాత్రలు, వారి మధ్య స్నేహం యువతను బాగా ఆకట్టుకుంటుంది.

ఓ బేబీ (2019)
ఫాంటసీ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఓ మహిళ తిరిగి యవ్వనాన్ని ఎలా పొందుతుంది, ఆ వయసులో ఆమెకు కలిగే అనుభూతి ప్రేక్షకులను అమాంతం కట్టిపడేస్తుంది. ఈ క్రమంలో తలెత్తే హాస్యాస్పద సన్నివేశాలు చాలా సహజంగా, వాస్తవానికి దగ్గరగానూ ఉంటాయి.ట

Image credts: Instagram