బ్రెయిన్ షార్ప్ గా పని చేయాలంటే? ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే! బ్రెయిన్ ఎంత షార్ప్ గా పని చేస్తే మనిషి అంత యాక్టివ్ గా ఉంటాడు. కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల మెదడు పాదరసంలా పని చేస్తుంది. బ్లూ బెర్రీలు తరచుగా తీసుకోవడం వల్ల వాటిలోని ఫ్లేవనాయిడ్లు జ్ఞాపకశక్తిని బాగా పెంచుతాయి. చేపల్లోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. బ్రోకలీలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ K జ్ఞాపకశక్తి పెంచుతాయి. డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్లు, కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తి మెరుగు పరుస్తాయి. పసుపులోని కర్కుమిన్ సమ్మేళనం మెదడు ఆరోగ్యాన్ని కాపాడి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. Photos Credit: Pixabay.com