నోరూరించేలా బేసన్ లడ్డూ రెసిపీ



శెనగపిండి - మూడు కప్పులు
పంచదార - మూడు కప్పులు
నెయ్యి - ఒక కప్పు
యాలకుల పొడి - ఒక స్పూను
జీడిపప్పు పలుకులు - ఓ పది
కిస్ మిస్‌లు - పది

కళాయిలో నెయ్యి వేసి శెనగపిండి కలపాలి.



చిన్న మంట పెట్టి వండాలి. లేకుంటే శెనగపిండి మాడిపోతుంది.



పచ్చి వాసన పోయే వరకు శెనగపిండిని నెయ్యిలో వేయించాలి.



తరువాత పంచదార వేసి కలపాలి.

అందులో జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి వేయించాలి.

యాలకుల పొడి కూడా వేసి కలపాలి.

శెనగపిండి రంగు మారి కాస్త డార్క్‌గా, ముద్దగా మారాక స్టవ్ కట్టేయాలి.